వనపర్తి: కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌చేయకపోతే.. తన చావుకు అతనే కారణమని సీఐ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామానికి చెందిన శివకుమార్‌యాదవ్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గత నెలలో స్థానిక మంత్రి గురించి ఓ వీడియో పోస్టు చేశానని అక్రమంగా అరెస్ట్ చేసి వనపర్తి పోలీస్‌స్టేషన్‌లో కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా కొట్టారని వాపోయాడు. ఫిర్యాదు చే సి నెలరోజులు గడుస్తున్నా సీఐపై ఎ లాంటి చర్యలు తీ సుకోలేదని, పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవ డం లేదని తెలిపా రు. ‘నన్ను తీవ్రంగా కొట్టిన సీఐపై చర్యలు తీసుకోకపోవడం మనస్తాపానికి గురి చేస్తోంది. న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాను. ఆయన పేరు రాసి సూసైడ్ చేసుకుంటా. నా చావుకు సీఐ కారణం అవుతాడు.’అని సోషల్‌మీడియాలో శివకుమార్ ఓ వీడియోను పోస్టు చేశాడు.
వీడియోను పోస్టు చేసిన మనిగిల్ల యువకుడు