రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం

- - Sakshi

అయిజ: ఆంధ్రప్రదేశ్‌ ఓర్వకల్లులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని వెంకటాపు రం గ్రామానికి చెందిన వివాహిత మృతిచెందింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోపాలయ్యశెట్టి, అతడి భార్య శశికళ (42) సోమవారం బేతంచెర్లలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌న సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శశశికళ అక్కడికక్కడే మృతిచెందగా.. గోపాలయ్యశెట్టికి స్వల్ప గాయాలయయ్యాయి. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

బస్సు ఢీకొని యువకుడు..

వనపర్తి క్రైం: బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం వనపర్తి మండలం నాగవరంతండా సమీపంలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన పరమేష్‌(24) హైదరాబాద్‌లో మేసీ్త్ర పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే తమ్ముడు బాలపీరు మృతిచెండంతో అంత్యక్రియల నిమిత్తం పరమేష్‌ వనపర్తికి వచ్చాడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్‌ వెళ్తుండగా, వనపర్తి మండలం నాగవరంతండా వద్ద కొత్తకోట నుంచి వనపర్తికి వస్తున్న బస్సును ఢీకొన్నాడు. అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు దాటుతూ మహిళ..

నారాయణపేట రూరల్‌: రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేటలోని సుభాష్‌ రోడ్డుకు చెందిన ఎక్బోటే నాగేశ్వరి(53) సోమవారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి లయన్స్‌క్లబ్‌ వైపు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌ మీద వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ద్విచక్రవాహనదారుడిని పట్టుకునేలోగా పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నాగేశ్వరి అల్లుడు ఎడికే అమర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. నాగేశ్వరి మృతి పట్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండి వేణుగోపాల్‌, బీజేపీ నాయకులు నాగురావునామాజీ, రఘు సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బావిలో పడి వ్యక్తి మృతి

నారాయణపేట రూరల్‌: బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్‌రోడ్‌కు చెందిన సంక్లాపురం ప్రదీప్‌ (37) సోమవారం ఉదయం బారంబావి దగ్గరకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. సాయంత్రం నీళ్లపై మృతదేహం తేలుతూ ఉండటాన్ని అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారించగా ప్రదీప్‌గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోసు ్టమార్టం నిమిత్తం శవాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై మృతుడి తమ్ముడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మరొకరు..

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని ఎన్మన్‌బెట్లలో పుట్ట స్వామి (45) ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ బాలవెంకటరమణ తెలిపారు. అక్క బొక్కలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు వివరించారు.

ఆలయంలోహుండీ అపహరణ

మిడ్జిల్‌: మండల కేంద్రంలోని వాడిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హుండీని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆలయ పూజారి యుగంధర్‌శర్మ సోమవారం మిడ్జిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మొదటి వార్షికోత్సవం సందర్బంగా స్వామి వారి కల్యాణం నిర్వహించారు. రాత్రి భజన ముగిసిన అనంతరం తెల్లవారుజామున లేచి చూసేసరికి హుండీ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కాన్నారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top