మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక ఎనుగొండలోని కేంద్రీయ విద్యాలయలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ కె.దశరథరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యాలయంలో బయాలజీ, ఇంగ్లిష్, మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, హిందీ సబ్జెక్టులు బోధించేందుకు పీజీటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మాథ్స్, సైన్స్ బోధించేందుకు టీజీటీల అవసరం ఉందన్నారు. అలాగే ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్‌లో పీఆర్‌టీలుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పీఈటీ, నర్స్‌తో పాటు బోధనేతర సిబ్బంది విభాగాల్లోనూ ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25న విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. దరఖాస్తులను https://mahabubnagar.kvs. ac.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.