ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలి

Jul 6 2025 7:09 AM | Updated on Jul 6 2025 7:09 AM

ప్రొట

ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలి

డిప్యూటీ సీఎం పర్యటన

విజయవంతం చేయాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

8న ఉపముఖ్యమంత్రి

భట్టి విక్రమార్క పర్యటన

మహబూబాబాద్‌: ఈనెల 8న జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అధికారులను ఆదేశించా రు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శనివా రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఈనెల 8న మానుకోట మండలం సోమ్లాతండా, కేసముద్రం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య లే కుండా పార్కింగ్‌ ఏర్పాట్లపై చర్యలు తీసుకో వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషో త్తం,ఆర్డీఓలు కృష్ణవేణి,గణేష్‌,ఆర్‌అండ్‌బీ ఈ ఈ బీమ్లానాయక్‌, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌, డీీపీఓ హరిప్రసాద్‌, తదతరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సరఫరాకు

మానిటరింగ్‌ సిస్టం

నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించేందుకు నూతన సాంకేతికతతో రియల్‌టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టం ప్రవేశపెట్టినట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా వచ్చిన సిస్టం ద్వారా విద్యుత్‌ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్‌ సిబ్బందికి తెలియజేయవచ్చని, తక్కువ సమయంలో విద్యుత్‌ పునరుద్దరణ జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగం, ఓల్టేజీ లెవెల్స్‌ వంటి వివరాలను రియల్‌ టైంలో సేకరించవచ్చన్నారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో వంద సబ్‌ స్టేషన్లను గుర్తించి పనులు ప్రారంభించారని, మిగిలిన వాటిని దశల వారీగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సకాలంలో రైతులకు

‘సహకార’ సేవలు

జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు

మహబూబాబాద్‌ రూరల్‌: రైతుల సేవలో సహకార శాఖ తరిస్తుందని, సకాలంలో వారికి అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సహకార అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. అంతర్జాతీయ సహకార దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో శనివారం డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయిని రంజిత్‌ మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌ కుమార్‌, డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ రజిత, ఫీల్డ్‌ ఆఫీసర్‌ యశ్వంత్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సింధు, సొసైటీ సెక్రెటరీ ప్రమోద్‌, సుధగాని మురళి, లూనావత్‌ అశోక్‌ నాయక్‌, ఆవుల వెంకన్న, నరేష్‌ నాయక్‌, నవీన్‌ నాయక్‌, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

హేమాచలక్షేత్రంలో

మాస కల్యాణం

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆలయ పూజారి ముక్కామల శేఖర్‌శర్మ ఆధ్వర్యంలో శనివారం మాసకల్యాణం(శాంతికల్యాణం) జరిపించారు. యాగశాలలో స్వామివారి జన్మనక్షత్రాన్ని(స్వాతి) పురస్కరించుకుని ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న భక్తులు శాంతి కల్యాణంలో పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ ప్రకారం  ఏర్పాట్లు చేయాలి1
1/1

ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement