
భక్తి శ్రద్ధలతో మొహర్రం
ఖిలా వరంగల్: మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రంను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ ఎల్‌బీనగర్ మోమిన్‌పురా, ఖిలా వరంగల్ మధ్యకోటలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి పీరీలకు పూలు, దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ పీరీల ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ సమీపంలోని పీరీల బావిలో రాత్రి 12 గంటలకు నిమజ్జనం చేసి ఘనంగా నివాళులర్పించారు.