
దివ్యాంగులకు శుభవార్త..
కాజీపేట: దివ్యాంగులకు శుభవార్త. రైల్వే శాఖ ఇటీవల (రెండు,మూడు నెలలు) నుంచి పాస్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే అందజేస్తోంది. దివ్యాంగులు గతంలో రైల్వే శాఖ అందించే రాయితీ పాస్‌ల కోసం స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అన్ని ధ్రువపత్రాలు, ఫొటోలు ఇచ్చినా ప్రక్రియ పూర్తయ్యే వరకు పలుమార్లు తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులు పడలేక కొందరు అసలు పాస్‌లు తీసుకోవడానికే ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 12,500 మంది కి పైగా దివ్యాంగులున్నారు. వారిలో సగం మందికిపైగా రైల్వే పాస్‌లు లేవు. వరంగల్, కాజీపేట, కాజీ పేట టౌన్, మహబూబాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ త దితర ప్రధాన రైల్వే స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడ మే అందుకు కారణం. ఈ అంశాలను గమనించిన రైల్వే శాఖ దివ్యాంగ పాస్ ప్రక్రియను సులభతరం చేసింది. రెండు, మూడు నెలల నుంచి ఆన్‌లైన్‌లో దివ్యాంగజన్ కార్డులు జారీ చేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా పాస్‌లు పొందడంతో పాటు ఇప్పటికే ఉన్నవారు నవీకరించుకునే వెసులుబాటు కల్పించింది.
నాలుగు దశల్లో పరిశీలన..
ఆన్‌లైన్ వివరాలు నమోదు చేశాక.. నాలుగు దశల్లో పరి శీలన జరుగుతుంది. అంతా సవ్యంగా ఉంటే.. నెల, నెలన్నర రోజుల్లో కార్డు జారీ చేస్తా రు. అది సమీప రైల్వే స్టే షన్‌కు వస్తుంది. దరఖాస్తులో పేర్కొ న్న ఫోన్ నంబర్‌కు సమాచారం రాగానే వెళ్లి కార్డు తీసుకోవచ్చు. ఈ కార్డుతో కేవలం రాయితీ పొందడమే కాకుండా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు పొందొచ్చు.
దరఖాస్తు విధానం ఇదీ...
● divyangianid. indianrail. gov. in వెబ్ సైట్‌లోకి వెళ్లి ప్రాధాన్య భాషను ఎంపిక చేసుకోవాలి. ఆ భాషలోనే పేజీ ఓపెన్ అవుతుంది. దానిని క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు వస్తాయి. ఆ ప్రకారం ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ, పూర్తి చిరునామా తదితర వివరాలు నమోదు చేయాలి. ఫొటోలు అవసరమైనా ధ్రువపత్రాలను పీడీఎఫ్ రూపంలో పొందుపరచాలి.
● తమ ఆధార్ కార్డు, సదరం ధ్రువపత్రం (అందులో వైద్యుడి వివరాలు, రిజిస్ట్రేషన్, వైకల్య స్వభావం స్పష్టంగా ఉండాలి.) ఉండాలి
● జనన ధ్రువపత్రం (ఆధార్, పాన్ కార్డు ఉండాలి, పదోతరగతి ధ్రువపత్రం ఉన్నా పర్వాలేదు) ఫొ టోలను పీడీఎఫ్ ఫార్మట్‌లో పొందుపర్చాలి.
ఆన్‌లైన్‌లో రైల్వే పాస్‌ల జారీ..
బుకింగ్ కౌంటర్ల వద్ద నిరీక్షణకు తెర