
మానుకోట జిల్లా పోలీసుల ప్రతిభ
మహబూబాబాద్ రూరల్: పోలీసులు కేవలం విధి నిర్వహణలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ రాణించగలరని నిరూపిస్తూ పోలీస్ డ్యూటీమీట్‌లో జిల్లా పోలీసులు 16 పతకాలు సాధించారు. భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్‌లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అందులో పాల్గొని ప్రతిభ కనబర్చి జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు తెచ్చిపెట్టారు. బాంబు స్క్వాడ్ విభాగంలో పీసీ రామయ్యకు (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ అశోక్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ వి.మహేశ్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ ఎ.మహేశ్ (ఒక సిల్వర్), పీసీ రాములు (ఒక గోల్డ్), వీడియో గ్రాఫర్ విభాగంలో పీసీ కుషాల్ కుమార్ (ఒక సిల్వర్), అబ్జర్వేషన్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ ఎబిలిటీ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్సై అరుణ్ కుమార్ (ఒక సిల్వర్), ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్సై ప్రవీణ్ (ఒక కాంస్య), పోలీసు పోర్ర్‌టైట్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో పీసీ సుమన్ (ఒక సిల్వర్), అబ్దుల్ ఖదీర్ (ఒక గోల్డ్, ఒక బ్రాంజ్) మొత్తంగా 16 మెడల్స్ సాధించారు. ఈపతకాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని రాణీ రుద్రమదేవి హాల్లో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్‌గా డీఎస్పీ శ్రీనివాస్, వారికి కోచ్‌గా బీడీ టీం పీసీ అంజయ్య టీం సభ్యులకు ప్రోత్సాహాన్ని అందించారు.
పోలీస్ డ్యూటీమీట్‌లో 16 పతకాలు