
కష్టపడిన ప్రతి కార్యకర్తకు తోడుంటాం
కోడుమూరు రూరల్: రానున్నది జగనన్న ప్రభుత్వమేనని, కష్టపడిన ప్రతి కార్యకర్తలకు అండగా నిలు స్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కోడుమూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సతీష్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోడుమూరు, గూడూరు, సీ.బెళగల్, కర్నూలు మండలాల ప్రజాప్రతినిధులు, వైఎస్సా ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల పేరిట సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను దారుణంగా మోసం చేశాడన్నారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు తనను గెలిపిస్తే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తానని కోడుమూరు ప్రజలకు హామీ ఇచ్చాడన్నారు. అయితే ఏళ్లు గడిచినా ఆ హామీ ఏమైందో, గుండ్రేవుల ప్రాజెక్టు కోసం పార్టీ మారుతున్నానంటూ ఓ నేత మాటలు ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సాగిస్తున్న మోసపు పాలనను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తెలియజెప్పాలన్నారు. జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్‌రెడ్డి, మౌలాలి, గూడూరు ఎంపీపీ సునీత, మున్సిపల్ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు లాయర్ ప్రభాకర్, హనుమంతరెడ్డి, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, మగ్బుల్, శివరాముడు, అధికార ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు రమేష్‌నాయుడు, మోహన్‌బాబు, రామాంజినేయులు, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి

కష్టపడిన ప్రతి కార్యకర్తకు తోడుంటాం