
మొహర్రం వేడుకల్లో గొడవలు వద్దు
● ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండండి: డీఎస్పీ
ఎమ్మిగనూరురూరల్: మొహర్రం వేడుకల్లో గొడవలు పెట్టుకోవాలని చూస్తే పోలీస్ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని డీఎస్పీ ఉపేంద్రబాబు హెచ్చరించారు. కోటేకల్ గ్రామానికి ఉన్న ఫ్యాక్షన్ ముద్రను చెరిపేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. శుక్రవారం రాత్రి కోటేకల్ గ్రామస్తులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో గతేడాది మొహర్రం వేడుకలు సందర్భంగా తప్పిదం జరిగిందని, ఈ సారి అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. పీర్ల ఊరేగింపు, సాహుసోని ఆడేటప్పుడు అందరూ అన్నదమ్ముల్లా ఉండాలన్నా రు. రూరల్ సీఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐ శ్రీనివా సులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.