
ఎలాంటి పామో తెలుసుకుని చికిత్స
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ మెడిసిన్) విభాగానికి ప్రతి నెలా 22 నుంచి 25 మంది పాముకాటుతో చికిత్స కోసం వస్తుంటారు. కొందరు మెడలో పాములు వేసుకుని వస్తే మరికొందరు బతికున్న పామును, చంపిన పాములతో వస్తుంటారు. ఏ పామో తెలిస్తే సరైన చికిత్స అందిస్తారని వారి ఉద్దేశం. అయితే వ్యక్తికి కాటేసింది ఎలాంటి పామో తెలిస్తే చాలు. వారి లక్షణాలు, పాము కాటేసిన ప్రాంతంలో ఉన్న ఛాయలను బట్టి వైద్యం అందిస్తాం. కొన్నిసార్లు ఏ లక్షణాలు లేకపోయినా 24 గంటల పాటు పరిశీలనలో ఉంచుకుని బాగున్నారంటే ఇంటికి పంపిస్తాం.
– డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్, కర్నూలు
పాముకాటుకు నాటు మందు ప్రమాదకరం
చాలా మంది పాముకాటు వేసిన వెంటనే నాటు మందు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పాము కుట్టిన చోట నీలం, ఎరుపు రంగులో మారుతుంది. కట్లపాము, నాగుపాము కాటువేస్తే అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శ్వాస తీసుకోకుండా చేసి వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. కళ్లు సరిగ్గా కనిపించవు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడం వల్ల గొంతులో కండరాలు బిగుసుకుపోయి నోట్లో నురగ వస్తుంది. ఫిట్స్ కూడా వస్తాయి. రక్తపింజరి కాటు వేయడం వల్ల రక్తం పల్చగా మారి మూత్రం, చిగుళ్లలో రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి పాముకాటు వేయగానే నాటు మందు జోలికి వెళ్లకుండా ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి.
– డాక్టర్ రవికళాధర్‌రెడ్డి,
జనరల్ ఫిజీషియన్, కర్నూలు
●

ఎలాంటి పామో తెలుసుకుని చికిత్స