
వర్షంలో తడవకుండా షెడ్డులోకి వెళ్లి..
మహానంది: వర్షానికి తడవకుండా రేకుల షెడ్డు కిందకు వెళ్లిన యువకుడు విద్యుత్‌దాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన తమ్మడపల్లెలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కోల శేషాద్రి (19) బంధువుల ఇంటికి వెళ్లాడు. బయటికి రాగా వర్షం పడుతుండటంతో పక్కనే ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లాడు. షెడ్డుపైన తీగలు తెగిపడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పైపులకు కరెంటు సరఫరా కావడంతో వాటిని పట్టుకుని నిలబడిన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, గ్రామ నాయకుడు జనార్ధన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి