
విద్యార్థుల ఆకలి కేకలు
ఎమ్మిగనూరుటౌన్: మధ్యాహ్న భోజనం అందక పోవడంతో విద్యార్థులు ఆకలితో కేకలు వేశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం ఖాళీ ప్లేట్లతో ఆందోళన నిర్వహించారు. నిబంధనల మేరకు మధ్నాహ్నం 12.40గంటలకు మధ్యాహ్న భోజనం వడ్డించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటలైనా స్పందించకపోవడంతో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాలకు, కళాశాలకు ఒకే వంట ఏజెన్సీ ఉండటంతో ఆకలితో అలమటించే పరిస్థితి వస్తోందని విద్యార్థులు వాపోయారు. సకాలంలో మధ్యాహ్న భోజనం వడ్డించాలని కోరారు. విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, వీరాస్వామి, రాజు, రంగన్న, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ ప్లేట్లతో ఆందోళన