
పట్టు వదలని ‘విత్తు’ మార్కుడు
అన్నదాత ఆశలను అడియాసలు చేస్తు వరుణుడు ముఖం చాటేయడంతో రైతులకు కన్నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులు ఖరీఫ్‌లో వర్షాధారం కింద పంటలు సాగు చేశారు. అయితే వర్షం జాడలేక పంటలు వాడు ముఖం పడుతున్నాయి. పెట్నికోటకు చెందిన రైతు గొంగటి వెంకట్రామిరెడ్డి ఆదివారం ట్యాంకర్‌తో పత్తి పంటకు నీరు అందించాడు. నెల రోజుల క్రితం నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. సగం భూమిలో మొలకెత్తగా మిగిలిన చోట్ల మొలకెత్తలేదు. దీంతో ట్యాంకర్‌తో విత్తనం మొలకెత్తని చోట పైపుతో నీళ్లు పడుతూ కనిపించాడు. వర్షం లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
– కొలిమిగుండ్ల