
జూలైలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కర్నూలు జిల్లా మహాసభలను జూలై మూడో వారంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం కన్వీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం టీజీవీ కళా క్షేత్రంలో నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.హుస్సేన్. జిల్లా కన్వీనర్ నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభల నిర్వహణపై చర్చించి జూలై మూడో వారంలో జరపాలని నిర్ణయించారు. ఈ మహాసభలకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. కాగా, మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఎనుకున్నారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఆదోని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బసప్ప, చంద్రమోహన్, ఎమ్మిగనూరు డివిజన్ గౌరవాధ్యక్షుడు దేవేంద్రమూర్తి, అధ్యక్షుడు షబ్బీర్, ఆలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కర్నూలు జిల్లా నాయకులు సునీల్‌కుమార్, బ్రహ్మయ్య, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు, నగర ఉపాధ్యక్షుడు బాబు పాల్గొన్నారు.