
ఽఢణాపురం దళిత సర్పంచ్ ఘటనపై తీవ్ర వాగ్వాదం
ఇటీవల ఆదోని మండలం ఽఢణాపురం గ్రామంలో చోటు చేసుకున్న దళిత సర్పంచ్‌కు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దళితుల పట్ల ఎమ్మెల్యే పార్థసారథి చిన్న చూపు చూస్తున్నారని, ఎమ్మెల్యే తప్పు చేసినందునే క్షమాపణ చెప్పారని దొరబాబు అన్నారు. తాను తప్పు చేయకపోయినా, దళిత ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా క్షమాపణ చెప్పానని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్‌సీపీ వారికి దళితులంటే చిన్న చూపు ఉన్నందునే గడచిన ఎన్నికల్లో వారిని పక్కన కూర్చోబెట్టారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే అమితమైన ప్రేమ ఉన్నందునే కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర రాజధానిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని దొరబాబు చెప్పారు.