
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు జడ్జి(జిల్లా ఫోర్టుపోలియో జడ్జి) జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లాకోర్టు హాలులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. సివిల్ దావాల్లో సెక్షన్9 సీపీసీ, లోక్‌అదాలత్ అవార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి వివరించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్‌కే కృపాసాగర్, విశ్రాంత జిల్లా జడ్జి టి.వేణుగోపాల్ శిక్షణ తరగతులను కొనసాగించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్‌కే కృపాసాగర్‌ను బార్ అసోసియేషన కార్యాలయంలో సన్మానించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు , న్యాయవాదులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి