
ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈగా చిరంజీవులు
కర్నూలు(హాస్పిటల్): ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఎం.చిరంజీవులు నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ తాడేపల్లి గూడెంలో ఈఈగా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్‌పై కర్నూలుకు వచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఆచార్య ఎన్‌జీ రంగ యూనివర్సిటీ(తిరుపతి)లో ఏఈగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని హార్టికల్చరల్ యూనివర్సిటీలో డీఈగా పనిచేశారు. 2014 నుంచి వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఈఈగా కొనసాగుతున్నారు.