
నేడు, రేపు పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కౌన్సెలింగ్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి ( గ్రేడ్ – 5 ), డిజిటల్ అసిస్టెంట్ ( గ్రేడ్ – 6 ) బదిలీలకు ఈ నెల 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –5 ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 29వ తేదీన ఉదయం 10 గంటలకు డిజిటల్ అసిస్టెంట్లకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే వారు తమ కేటగిరీలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు.