
సీమ రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ
జూపాడుబంగ్లా: రాయలసీమ రైతులపై సీఎం చంద్రబాబు నాయుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదలకు ఆస్కారం ఉన్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగల భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, సర్పంచ్ నాగార్జునరెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ కోసిక తిరుమలేశ్వరరెడ్డితో పాటు పలువురు రైతులు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తోకల కృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం పోతిరెడ్డిపాడును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక, బచావత్ తీర్మాన ప్రకారంగా శ్రీశైలం జలాశయంతో 854 అడుగుల నీటిమట్టం చేరితే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా సాగు, తాగునీటిని విడుదలకు అనుమతి ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. హెడ్‌రెగ్యులేటర్‌కు అనుసంధానంగా ఉన్న తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల కింద 6.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ముందస్తు వర్షాలకు ఖరీఫ్ సీజన్ కింద మొక్కజొన్న, పత్తి, మినుము, కంది, తదితర పంటలను సుమారు లక్ష ఎకరాల మేర రైతులు పంటలను చేసుకున్నారన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక పంటలు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం దాటి వారం రోజులైనా నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి రాయలసీమ రైతాంగానికి సాగు, తాగునీటినివ్వకుండా సీఎం చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెట్టడం తగదన్నారు. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయకుండా పోలవరం నుంచి బానకచర్ల వరకు గోదావరి జలాలను తరలిస్తామని పేర్కొనటం సబబుకాదన్నారు. 70 శాతం పూరైన ప్రాజెక్టును గాలికొదిలేసి.. రూ.81వేల కోట్ల నిధులతో గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, తరుణ్‌కుమార్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, నాగశేనారెడ్డి, చిన్నమల్లయ్య, చిన్న ఎర్రన్న, భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
‘పోతిరెడ్డిపాడు’ నుంచి నీటి విడుదల చేయండి

సీమ రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ