
శ్రావణంలో శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు శ్రావణ మాసంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 354వ సప్తరాత్రోత్సవాలకు సంబంధించి ఆహ్వాన కార్డుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక మేనేజర్ శ్రీపతి ఆచార్ నేతృత్వంలో రాఘవేంద్రులు, వాదీంద్రతీర్థుల మూల బృందావనాలతో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ప్రముఖులకు ఈ ఆహ్వాన కార్డుల ద్వారా ఆహ్వానం పలుకనున్నారు.
కారు అద్దాలు పగులగొట్టి ..
● రూ. 7 లక్షలు అపహరణ
ఆళ్లగడ్డ: సినీ ఫక్కీలో కారు అద్దాలు పగలగొట్టి పట్టపగలే రూ. 7 లక్షలు చోరీ చేసిన ఘటన ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగింది. అహోబిలం గ్రామానికి చెందిన నరేష్ పట్టణంలోని ఓ బ్యాంకులో రూ. 7 లక్షలు డ్రా చేసుకుని నగదు బ్యాగ్‌ను కారులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి విశ్వశాంతి స్కూల్‌లో చదువుతున్న పిల్లల దగ్గరకు వెళ్లాడు. స్కూల్ ఎదుట కారు ఆపి తరగతి గదిలోని పిల్లల దగ్గరకు వెళ్లాడు. అంతలోనే కారు వెంట బైక్‌పై ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కారు అద్దాలు పగులగొట్టి రూ. 7 లక్షలు ఉన్న బ్యాగును దొంగిలించి పారిపోయారు. గమనించిన వ్యక్తులు కేకలు వేస్తూ వెంటపడగా నిమిషాల్లోనే కనిపించకుండా పారిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రావణంలో శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు