
బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ ఎన్నిక
కర్నూలు(అర్బన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పెద్దకడుబూరు వసతి గృహ సంక్షేమాధికారి పాలెగార్ సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ కళాశాల బాలుర వసతి గృహం సంక్షేమాధికారి పి.శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎస్.ప్రమీల, కోశాధికారిగా కనకలత, ఉపాధ్యక్షులుగా సీ.శంకర్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.గిరిజాదేవి, సంయుక్త కార్యదర్శులుగా నరసప్ప, హారతీదేవి, ఎల్లమ్మ, కార్యవర్గ సభ్యులుగా గోపాల్, బసవరాజు, ప్రసన్నబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా వసతి గృహ సంక్షేమాధికారులందరూ ఐకమత్యంగా విధులు నిర్వహించాలన్నారు. నూతన కార్యవర్గాన్ని సహచర వసతి గృహ సంక్షేమాధికారులు అభినందించారు.

బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ ఎన్నిక