
ఘనంగ ‘మట్టెద్దు’ల పండుగ
హొళగుంద: కర్ణాటక సంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న హొళగుంద మండల ప్రజలు బుధ వారం మట్టెద్దుల పండుగను భక్థిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏటా ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమవాస్య రోజున మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారుచేసి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భా గంగా బుధవారం ఆయా గ్రామాల ప్రజలు మట్టి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. చిన్నహ్యాట గ్రామంలో సాయంత్రం కోలాటం, నృత్యాలతో మట్టి ఎద్దుల ఊరేగించి వైభవంగా నిమజ్జనం చేశారు.