
ఏపీ ఏఐయూకేఎస్ అధ్యక్షుడిగా అర్లప్ప
నందికొట్కూరు:ఆంధ్రప్రదేశ్ అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్యక్షుడిగా వేల్పుల అర్లప్పను ఏకగ్రీవంగా ఎన్నుకునట్లు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. జంగారెడ్డి గూడెంలో రోటరీ క్లబ్‌లో జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ మహాసభలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వేల్పుల అర్లప్ప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో రైతు సమస్యలపై నిరంతరం కృషి చేస్తానన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.