
సచివాలయం ఖాళీ !
ఖాళీగా దర్శనమిస్తున్న మద్దికెర గ్రామ సచివాలయం – 1
మద్దికెర: కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందించాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. కార్యకలాపాలు సాఫీగా సాగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఒకటవ సచివాలయంలోని ఫర్నిచర్ ఇతర కార్యాలయానికి తరలించడంతో ఖాళీగా ఇలా దర్శనమిస్తోంది. కూర్చోవడానికి కుర్చీలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఎవరూ లేరని వెనుదిరిగిపోతున్నారు. ఇదే సచివాలయంలో ఆధార్ సేవల కేంద్రం నిర్వహిస్తుండడంతో వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ఒక కార్యాలయంలోని ఫర్నిచర్ మరో కార్యాలయానికి ఎలా తరలిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.