
శ్రీశైలంలో ముమ్మర తనిఖీలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలచే తనిఖీలు చేపట్టారు. మంగళవారం శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, సరిహద్దుల్లో, వసతి గృహాలు, గుడి పరిసర ప్రాంతాలు, చెక్‌పోస్టులలో, శ్రీశైలం అంతటా తనిఖీలు చేపట్టారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో, ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని ముందస్తు జాగ్రత్తగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు ఆలయం చుట్టుపక్కల, పార్కింగ్ స్థలాలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, బస్టాండ్, కల్యాణకట్ట తదితర ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.