
సొంతవారికి పరీక్షే!
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వార్డ్‌బాయ్‌లు, స్ట్రెచర్‌బాయ్‌ల కొరత వేధిస్తోంది. ఉన్నవారు ఉన్నతాధికారుల సేవకు పరిమితం కావడంతో ఆయా వార్డుల్లో చికిత్స కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు, ప్రమాదాల్లో గాయపడిన వారిని వైద్య పరీక్షల నిమిత్తం సొంతవారే తీసుకెళ్లాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు రోగులను ఆక్సిజన్ మాస్క్‌లతోనే వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లపై ఆయా కేంద్రాలకు తీసుకెళ్లి వేచిఉండి పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించి ఆయా వార్డుల్లో వార్డ్‌బాయ్స్, స్ట్రెచర్ బాయ్స్‌లను నియమించాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

సొంతవారికి పరీక్షే!

సొంతవారికి పరీక్షే!

సొంతవారికి పరీక్షే!

సొంతవారికి పరీక్షే!

సొంతవారికి పరీక్షే!