
ఏపీకే ఫైల్స్, లింక్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు
కర్నూలు (టౌన్): సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఏపీకే ఫైల్స్, లింక్‌లను ఎవరూ ఓపెన్/డౌన్‌లోడ్ చేయరాదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని క్లిక్ చేస్తే ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారని చెప్పారు. సై బర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు,డాక్యుమెంట్లు,ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దన్నారు. ఫోన్‌లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత స మాచారం,బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట ను దొంగలించి ఆర్థిక నష్టానికి గురి చేస్తారని వివరించారు.
ఎస్పీ సూచనలు
● ప్లే స్టోర్ తప్పా మరో వేదికల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయరాదు.
● గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్‌లు ఓపెన్ చేయవద్దు
● ఫోన్‌లోని ప్రతి యాప్‌కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించండి
● బ్యాంకు అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు
● ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ చేసిన ట్లయితే వెంటనే ఆయాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలి.
● మొబైల్‌ను రీసెట్ చేసి, ట్రస్ట్ చేసిన యాప్‌లను మాత్రమే తిరిగి ఇన్‌స్టాల్ చేయాలి
● ఫోన్‌లో భద్రతా యాప్ ఉపయోగించండి
● బ్యాంకింగ్ ఆప్లికేషన్లలో బయోమెట్రిక్, 2– ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్‌ను వాడాలి
మోసానికి గురైన వారు చేయాల్సిన చర్యలు
● తక్షణం జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి
● www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి
●సమీపంలోని పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
మోసాలు ఏలా చేస్తారంటే !
నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, మేసేంజర్, ఇన్‌స్టా గ్రామ్, ఎస్‌ఎంఎస్ ద్వారా లింక్ పంపుతారు.
డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, రివార్‌ుడ్స అప్డేట్, షీ గిఫ్ట్, అరెంట్ డాక్యుమెంటు ఈ– చలానా తదితర పేర్లతో లింక్‌ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తారు.
ఆ లింకు ద్వారా ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. వినియోగదారుడు దీన్ని యాప్ అనుకొని ఇన్‌స్టాల్ చేస్తారు.
ఆ యాప్ అనుమతులు అడుగుతుంది. ఎస్‌ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాగ్, స్టోరేజీ, నోటిఫికేషన్స్, యాక్సెసబిలిటీ ద్వారా ఆకర్షిస్తున్నారు.
ఈ అనుమతులతో నేరగాళ్లు ఫోన్‌ను పూర్తిగా నియంత్రిస్తారు.
ఫోన్‌లోని ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డు సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది.
కొన్నిసార్లు యుపీఐ యాప్‌లను కూడా యాక్సెస్ చేసి ఖాతాల్లోని డబ్బును దొంగిలిస్తారు.
కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్ మెయిల్‌కు ప్రయత్నిస్తారు.