
● ఐదుగురికి గాయాలు ● అతిగా మద్యం సేవించి కారు నడపడంతోనే
డివైడర్‌ను ఢీకొన్న కారు
కర్నూలు (టౌన్): కొత్త కారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. అందులో ఐదుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న విగ్రహం దిమ్మెను ఢీకొట్టారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. కొత్త మహీంద్రా థార్ కారులో స్థానిక సోమిశెట్టి నగర్‌కు చెందిన డ్రైవర్ శశికుమార్,వితేష్ , సునీల్, భార్గవ్, చంద్రకాంత్ కలిసి మద్యం సేవించారు. కొత్త బస్టాండ్ వద్ద మద్యం సేవించి మద్యం మత్తులో ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బళ్లారి చౌరస్తా మీదుగా హోసన్న మందిరం వైపు వెళుతున్నారు. అయితే స్థానికంగా ఏపీఎస్పీ క్యాంపు ప్రధా న రహదారి గేటు ఎదురుగా మొయిన్ రోడ్డు డివైడర్‌పై ఉన్న దివంగత మేజర్ సీ.ఆర్.రెడ్డి పోలీసు అధికారి విగ్రహం దిమ్మెను ఢీకొట్టారు. విగ్రహం కూలిపోయింది. ఆ సమయంలో కారులోని బెలూ న్లు తెరుచుకోవడంతో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు.