మహానంది: మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరస్వామికి సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో విశేష ద్రవ్యాభిషేకం నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానందీశ్వర ఆలయ అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ పి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా గణపతిపూజ, పంచామృతాలు, విశేష ద్రవ్యాలు, వట్టివేర్లతో పాటు క్షీరాభిషేకం చేశారు. పలు ప్రాంతాల భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా నందీశ్వరాభిషేకం వీక్షించి స్వామివారి పూజలో పాల్గొన్నారు.