ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువకులు పిడికిలి బిగించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంపై నిరసన గళం విప్పారు. రాష్ట్రం ప్రభుత్వ మోసంపై నిరుద్యోగులు, విద్యార్థులు భగ్గుమన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘యువత పోరు’ నిరసనక | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువకులు పిడికిలి బిగించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంపై నిరసన గళం విప్పారు. రాష్ట్రం ప్రభుత్వ మోసంపై నిరుద్యోగులు, విద్యార్థులు భగ్గుమన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘యువత పోరు’ నిరసనక

Jun 24 2025 4:19 AM | Updated on Jun 24 2025 4:19 AM

ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువకులు పిడికిలి బిగించారు. నిర

ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువకులు పిడికిలి బిగించారు. నిర

కర్నూలు (టౌన్‌): జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు కర్నూలులో కదం తొక్కారు. ఎ.క్యాంపులోని విజయ పాల డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌, జయహో వైఎస్సార్‌’ అంటూ నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వై. శివారెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఏడాది దాటినా నిరుద్యోగ భృతి మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులను సైతం మోసం చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి సినిమాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

ఉన్నత చదువులు !

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యార్థుల చదువులు ఆందోళన కరంగా మారాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉన్నత చదువులు చదివే పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి నిధులు రూ. 26 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏడాది కాలంగా ప్రభుత్వంపై పోరాటాలు చేయడంతో తల్లికి వందనం అమలు చేశారని, అయితే అందులోనూ రూ. 8 వేల కోట్ల నిధులు ఎగ్గొట్టారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేసేంత వరకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆగబోదన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి ఇన్‌చార్జ్‌ డీఆర్వో వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించారు.

నిరసనలో పాల్గొన్న వారు వీరే..

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దుర్గా ప్రసాద్‌ (పాణ్యం), బాలు (కర్నూలు), నజీర్‌ (ఎమ్మిగనూరు), వెంకటేష్‌ (కోడుమూరు), ఆశోక్‌ రెడ్డి (పత్తికొండ), ఆశోక్‌ నాయుడు (ఆలూరు), రాజశేఖర్‌రెడ్డి (మంత్రాలయం), వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మణిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కటారి కొండ సాయికుమార్‌, నగర అధ్యక్షులు అన్సూర్‌, ఆలూరు నియోజకవర్గ అధ్యక్షులు రాజు, ఎమ్మిగనూరు (బలరాం యాదవ్‌), జిల్లా నాయకులు మధు, సంతోష్‌, మణీదీప్‌ రెడ్డి, హేమంత్‌ కుమార్‌, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

కర్నూలులో నిర్వహించిన ‘యువత పోరు’ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువకులు, నిరుద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement