
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
కర్నూలు (టౌన్): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా జడ్జి కబర్ది అన్నారు. ఆదివారం ఒలింపిక్ డే క్రీడా సంబరాలను పురస్కరించుకొని కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పరుగు నిర్వహించారు. క్రీడా జ్యోతి పట్టుకొని జిల్లా జడ్జి ఈ పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. పరుగులో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం విశేషమన్నారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. ఒలంపిక్ డేను పురస్కరించుకొని క్రీడా సంఘాల ఆధ్వర్యంలో 10 రోజులుగా చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి, విద్యావేత్త డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ సభ్యులు గుడిపల్లి సురేందర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి కబర్ది