నేడు యువత పోరు | - | Sakshi
Sakshi News home page

నేడు యువత పోరు

Jun 23 2025 5:40 AM | Updated on Jun 23 2025 5:40 AM

నేడు యువత పోరు

నేడు యువత పోరు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు (టౌన్‌): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరవేర్చాలన్న డిమాండ్‌తో సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువత పోరు పేరుతో నిర్వహిస్తున్న నిరసన, ధర్నాకు పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా నిరుద్యోగులు తరలి రావాలని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి నెలా రూ. 3 వేలు భృతి ఇస్తామని చెప్పి ఏడాది అయినా అమలు చేయలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement