
కారు బీభత్సం
● పలువురికి గాయాలు
కర్నూలు కల్చరల్: కర్నూలు నగరంలో ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాజ్‌విహార్ నుంచి సీక్యాంప్ వైపు వెళుతున్న కారు బుధవారపేట వద్ద బైక్‌పై వెళుతున్న జయచంద్ర అనే వ్యక్తిని, త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఎస్‌ఐ ఆశలతను ఢీకొట్టింది. ప్రమాదంలో జయచంద్రకు తీవ్ర గాయాలు కాగా, ఎస్‌ఐకి కాలు విరగడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు మార్గ మధ్యలో ఐదారుగురిని ఢీకొట్టింది. కర్నూలు కలెక్టరేట్‌లోని చీకటి ప్రాంతంలో కారును వదిలేశారు. కారు నడుపుతున్న వ్యక్తి న్యాయవాది శ్రీనివాసులుగా గుర్తించారు. అతన్ని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.