
చదువుకే ప్రాధాన్యం..
ఇంటర్‌లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.
సమయం.. సద్వినియోగం
ఇంటర్‌లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.
వ్యసనాలకు దూరంగా ఉండాలి..
జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్‌ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పార్టీలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది.
లక్ష్యానికి తొలి అడుగులు..
భవిష్యత్‌లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకై నా తొలి అడుగు పడాల్సింది ఇంటర్‌లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి.
స్నే‘హితులు’
ఇంటర్‌లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి.

చదువుకే ప్రాధాన్యం..

చదువుకే ప్రాధాన్యం..