
గుర్తుకొస్తున్నాయ్..
● 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న
తెర్నెకల్ జెడ్పీ పాఠశాల విద్యార్థులు
ఆలూరు రూరల్: చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల అందించిన అనుభవాలను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి చదువులపై ముచ్చటించుకున్నారు. బాల్యం జ్ఞాపకాల్లో మునిగి తేలారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామ జెడ్పీ హైస్కూల్‌లో 1994–95 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. అప్పట్లో చదువు చెప్పిన గురువులు హరిచంద్రా రెడ్డి, రంగస్వామి, గంగాధర్‌ను ఆత్మీయంగా సన్మానించారు. వారు బోధించిన చదువు, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అవరోధించామని చెబుతూ పాదాభివందనం చేశారు. పూర్వ విద్యార్థులు రాఘవేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్లు, రామచంద్ర తదితర 20 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

గుర్తుకొస్తున్నాయ్..