
సంప్రదాయ విద్యా విధానాలే మేలు
విద్య విషయంలో పిల్లలకు సంప్రదాయ విధానాలతోనే బోధించాలి. డిజిటల్ తెరలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పిల్లలు మొబైల్ ఫోన్‌లను పాఠశాలలకు తీసుకురావడానికి అనుమతించకూడదు. సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు డిజిటల్ తెరలకు దూరంగా ఉంచాలి. ఆహారం తినిపించేందుకు సైతం వీటిని ఉపయోగించకూడదు. వారికి కథలు చెప్పడం, ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, నృత్యం చేయించడం, వయస్సుకు తగిన బొమ్మలతో ఆడేలా చేయాలి. వీటి వల్ల వారు డిజిటల్ తెరలకు క్రమంగా దూరం అవుతారు.
– డాక్టర్ జి. సుధాకర్,
చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు