
జిల్లా కోర్టులో...
కర్నూలు(సెంట్రల్): ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఉద్యోగులకు సూచించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగాసానాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత పని భారం ఉన్నా రోజూ అరగంటపాటు యోగాసానాలు వేస్తే మానసిక ఒత్తిడి తొలగి ప్రశాంతం చేకూరుతుందన్నారు. శ్వాసను మనసుతో అనుసంధానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయ శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.