
రక్తదానం చేసిన ఆర్డీఓ
ఆదోని టౌన్: పత్తికొండ ఆర్డీఓ డాక్టర్ ఎస్.భరత్‌నాయక్ శనివారం ఆదోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(ఏరియా ఆసుపత్రి)లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ఐదుసార్లు రక్తదానం చేశానన్నారు. రక్తం దానం చేయడం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే అన్నారు. బాధితుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపినవారమవుతామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే రక్తదానం ప్రధాన లక్ష్యమన్నారు.
డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ
ఆలూరు రూరల్: డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఒక లారీ ఆలూరులోని డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. లారీ కర్నూలు నుంచి బళ్లారి వైపునకు ఆలూరు మీదుగా వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం అర్ధరాత్రి సయమం కావడంతో ఆలూరులోని సహకారం సంఘం బ్యాంక్ సమీపంలో డివైడర్‌పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీ కింది భాగమంతా ధ్వంసం కాగా.. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.
నల్లమలలో ట్రాఫిక్ జాం
ఆత్మకూరురూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆత్మకూరు – దోర్నాల ప్రధాన రహదారిలోని నంద్యాల – ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో శనివారం భారీ వృక్షం నేల కూలడంతో రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. పెద్ద పెంట రాస్తా ఏటిపాయ గేటు వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో దాదాపు 2 గంటల వరకు అడవిలో ప్రయాణికులు అల్లాడి పోయారు. అటవీ శాఖకు చెందిన ప్రొటక్షన్ వాచర్లు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు యథాతధంగా కొనసాగాయి.
జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాధ్యతల స్వీకరణ
గోస్పాడు: జిల్లా ఔషధ నియంత్రణ అధికారిగా హనుమన్న శనివారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన దాదా ఖలందర్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురంలో పని చేస్తున్న హనుమన్నను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విధుల్లో చేరారు. నంద్యాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతలతో పాటు కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డోన్, డివిజన్‌కు డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా కర్నూలు రూరల్ విభాగానికి జయరాంను నియమించారు.

రక్తదానం చేసిన ఆర్డీఓ

రక్తదానం చేసిన ఆర్డీఓ