‘కూటమి’ నాయకుల ధ్వంస రచన | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ నాయకుల ధ్వంస రచన

Jun 22 2025 3:54 AM | Updated on Jun 22 2025 3:54 AM

‘కూటమి’ నాయకుల ధ్వంస రచన

‘కూటమి’ నాయకుల ధ్వంస రచన

● ఆదోనిలో వైఎస్సార్‌సీపీ జెండా కట్ట ధ్వంసం ● త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

ఆదోని టౌన్‌: ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ‘కూటమి’ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ధ్వంస రచన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఆదోని పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ జెండా కట్టను ధ్వంసం చేశారు. జెండా, జెండాకు సంబంధించిన పైపును విరగొట్టారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహులు, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు దేవ, పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు అక్కడి వెళ్లి ధ్వంసమైన కట్టను పరిశీలించారు. అనంతరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుండాన్ని చూస్తూ సహించలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. పార్టీ జెండాను ఇలా అవమానించడం తగదన్నారు. ఇలాంటి దుశ్చర్యలతో ఘర్షణలు, గొడవలు జరిగే ప్రమాదం ఉందన్నారు. దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ పట్టణ సెక్రటరీ తాయన్న, ఎస్సీ సెల్‌ పట్టణాధ్యక్షుడు యేసేపు, కౌన్సిలర్‌ అశోక్‌, నాయకులు ప్రసాద్‌, బుడ్డేకల్‌ బాబు, కిషోర్‌, పట్టణ కార్యదర్శి బాబా, కౌన్సిలర్‌లు రఘునాథ్‌రెడ్డి, ఫయాజ్‌, అశోక్‌, నాయకులు దినేష్‌, ఉస్మాన్‌, చిన్నరామకృష్ణారెడ్డి, భీమ, వీరప్ప, నారాయణ, హరిశ్చంద్ర, కౌన్సిలర్‌ చలపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement