
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు
● బాధితుల్లో ఎంపీటీసీ సభ్యుడు
సి.బెళగల్: మండల కేంద్రమైన సి.బెళగల్‌లో పిచికుక్క దాడి చేయడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తొలుత గ్రామ శివారులోని ఇటుబట్టీలో పనిచేసే ప్రదీప్‌పై దాడి చేసి గాయపరచింది. అనంతరం గ్రామంలోకి ప్రవేశించి తహసీల్దార్ కార్యాలయం దగ్గరున్న సి.బెళగల్ ఎంపీటీసీ సభ్యుడు వీరన్న గౌడ్‌ను కరిచింది. వెలుగు కార్యాలయం బయట ఉన్న సీసీ శ్రీనివాసులుపై దాడిచేసి గాయపరచింది. పోలీస్ స్టేషన్‌లో వెళ్లి కొత్తకోట గ్రామానికి చెందిన మధు అనే యువకుడికి కరిచి గాయపరచింది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తిని కరవడంతో అతను గాయంతో అలాగే వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితులకు సి.బెళగల్ పీహెచ్‌సీలో డాక్టర్ మిథున్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వైద్యం అందించారు.