
ఔదార్యం చాటుకున్న ‘తలి’్లకి వందనం
ఉయ్యాలవాడ: పేద కుటుంబమైనప్పటికీ తన బ్యాంకు ఖాతాలో జమైన మరో తల్లికి చెందిన ‘తల్లికి వందనం’ డబ్బును తిరిగిచ్చి ఓ మహిళ ఔదార్యం చాటుకుంది. వివరాలు.. ఉయ్యాలవాడ మండల ప్రజా పరిషత్ పాఠశాల(మెయిన్)లో గ్రామానికి చెందిన కుమారి కుమారుడు శివ సాత్విక్, పావని కుమారుడు పవన్ గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ‘తల్లికి వందనం’ డబ్బులు కుమారి ఖాతాలో రూ.26 వేలు జమ అయ్యాయి. దీంతో తనకు సంబంధం లేని డబ్బులు తనకు వద్దని కుమారి శుక్రవారం పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పావనికి నగదు అందజేశారు. రాజు, కుమారి దంపతుల నిజాయితీని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఆదామ్, మహబూబ్ బాషా, రాజు మెచ్చుకుని వారిని అభినందించారు.