
30 ఏళ్లుగా యోగా శిక్షణ
1982లో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. స్నేహితుల సలహాతో వారం రోజుల పాటు యోగా చేసి తగ్గించుకున్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో యోగా గురువు సూరిరాఘవ దీక్షితుల వద్ద, అనంతరం కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న రాఘవేంద్ర స్వామీజీ వద్ద 30 రోజుల శిక్షణ పొందాను. 1991లో గుజరాత్, గాంధీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, డిప్లామాలో యోగా చేశాను. కర్నూలులో శ్రీ వాల్మీకి యోగా కేంద్రం ద్వారా 30 ఏళ్లుగా ప్రజలకు యోగాను నేర్పిస్తున్నాను. ఇందులో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నా సేవలకు డాక్టరేట్‌లు, భారత యోగ శిరోమణి, గురుబ్రహ్మ వంటి అవార్డులు దక్కాయి. – బీటీ జయలక్ష్మి,
యోగా శిక్షకురాలు,
శ్రీ వాల్మీకి యోగా కేంద్రం, కర్నూలు