
ప్రైవేట్ బస్సు ఢీకొని కాడెద్దులు మృతి
– రైతుకు గాయాలు
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో కాడెద్దులు మృతిచెందగా రైతు గాయాలపాలయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఉదయం పొలానికి ఎడ్ల బండితో బయలుదేరాడు. కర్నూలు నుంచి ఆదోని వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు వేగంగా వెనుకనుంచి ఎడ్ల బండిని ఢీకొంది. ప్రమాదంలో రెండు ఎద్దులు మృతి చెందగా, రైతు ఆంజనేయులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంరతం కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
గడివేముల: మండల కేంద్రానికి చెందిన గువ్వల రాజు అదృశ్యమయ్యాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి శుక్రవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గువ్వల రాజు (38) గ్రామంలో జీవాలు మేపుకుంటూ జీవనం కొనసాగించేవాడు. మనస్పర్థల కారణంగా భార్య బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో కొన్నేళ్ల నుంచి కుమారుడితో విడిగా జీవనం సాగిస్తోంది. గత నెల 26న జీవాలను మేపుకోవడానికి వెళ్లి ఇంటికి తిరగిరాలేదు. దీంతో రాజు అన్న జనార్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ప్రైవేట్ బస్సు ఢీకొని కాడెద్దులు మృతి

ప్రైవేట్ బస్సు ఢీకొని కాడెద్దులు మృతి