ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు రోడ్డులోని గ్రాండ్ మాల్ హోటల్ ఎదురుగా మైదానంలో ఆరబెట్టిన ఎండు మిర్చిని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కలుగొట్ల గ్రామానికి చెందిన రైతు బోయ శ్రీనివాసులు 5 ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప సాగుచేశాడు. ఇటీవల కోత కోసి పండు మిర్చిని గ్రాండ్ మాల్ హోటల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆరబోసుకున్నాడు. ఆదివారం ఉదయంవచ్చి చూడగా దిగుబడులు తగ్గినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అక్కడికి చేరుకుని సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా శనివారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లు, కాసేపటికి పరుగెత్తిన దృశ్యాలను గుర్తించారు. దాదాపు నాలుగు క్వింటాళ్ల ఎండు మిర్చి చోరీకి గురైనట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
బేతంచెర్ల: స్థానిక బనగానపల్లె రహదారిలో కస్తూర్బా సమీపాన ఆదివారం రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఉదయం డోన్ పట్టణం కొండపేటకు చెందిన వెంకట రాముడు, మాధురి, గణేష్ కార్తీక మాసం సందర్భంగా బోలెరాలో కొత్తూరు సుబ్బరాయుడు స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. సొంత పనినిమిత్తం బైక్ వెళ్లిన పట్టణానికి చెందిన సుధాకర్ రోడ్డు దాటుంతుడగా బొలేరో వాహనం బొలెరా వాహనం ఢీకొంది. బొలేరా వాహనంలోని ముగ్గురికీ తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుధాకర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి.