
నీటికుంటలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసు
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని చెరువు వద్ద ఉన్న నీటికుంట(గుండాల)లో ఆదివారం ఓ మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ ఆశోక్ తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు నీటికుంటలో తెలియాడుతున్న మహిళా మృతదేహం వద్దకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతురాలు పాణ్యం గ్రామానికి చెందిన కై ప సుబ్బలక్ష్మమ్మ(48)గా గుర్తించినట్లు చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఈమె దుస్తులు ఉతికేందుకు నీటికుంట వద్దకు వచ్చిందని, అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త సుధాకర్, కుమారుడు, కుమార్తె ఉన్నారు.