నంద్యాల(సిటీ): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ శనివారం మధ్యాహ్నం వెబెక్స్‌లో బైజూస్ కంటెంట్‌పై మొదటి సెషన్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు డీఈఓ అనురాధ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో బైజూస్ ట్యాబులలో తరచూ తలెత్తే సమస్యల నివారణోపాయాలు, ట్యాబుల వినియోగం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ట్యాబులలో చేర్చే అంశాలపై ఉపాధ్యాయులకు, అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులు తరచూ ట్యాబును వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ అధికారలను ఆదేశించారు. మొదటి విడతలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బండిఆత్మకూరు, బేతంచెర్ల, చాగలమర్రి, డోన్, దొర్నిపాడు, గడివేముల, గోస్పాడు మండలాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు తదితరలు పాల్గొన్నారన్నారు.