
పాణ్యం: టీడీపీ హయాంలో పరిశ్రమల పేరుతో తీసుకున్న రైతు పొలాలను అస్తవ్యస్తంగా సర్వే చేశారని, దీంతో నేటికీ ఇబ్బందులు తొలగిపోలేదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పాణ్యంలో నిర్వహించిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిన్నాపురానికి సోలార్ పరిశ్రమ వస్తుందనే ఉద్దేశంతో టీడీపీ హయాంలో ఇష్టానుసారంగా సర్వే చేసి రైతులు ఎవరూ లేరని రికార్డులో నమోదు చేశారన్నారు. అప్పటి కలెక్టర్ విజయ్‌మోహన్ రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే టీడీపీ హయాంలో ఓర్వకల్లు మండలంలో పలు చోట్ల భూ రికార్డులను తారుమారు చేశారన్నారు. అసైన్‌మెంట్ కమిటీ సూచనలు తుంగలో తొక్కారని విమర్శించారు. ఆనాడు చేసిన తప్పులను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
రాంభూపాల్‌రెడ్డి