కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెలలో వరుసగా సెలవులు వచ్చాయి. ఈనెల 4వ తేదీని ప్రభుత్వం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. దీనిని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు. 5వ తేదీ బాబు జగ్‌జీవన్‌రామ్ జయంతి, 7వ తేదీ గుడ్‌ప్రైడేలను ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది. 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కూడ సెలవు దినాలే. 10వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. 14న అంబేడ్కర్ జయంతి, 22న రంజాన్ పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తి కావడంతో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో మూల్యాంకన క్యాంప్‌ను శనివారం ప్రారంభించారు. క్యాంపు ఆఫీసర్‌గా ఉన్న ఆర్‌ఐఓ గురవయ్యశెట్టి ముందుగా సమావేశాన్ని నిర్వహించారు. స్పాట్‌వాల్యుయేషన్‌లో పాల్గొవాలని అధ్యాపకులకు అర్డర్లు ఇచ్చామని, విధులకు హాజరుకాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. గణితం సబ్జెక్టుకు 227 మందికి గాను 150 మంది, ఇంగ్లిషు 220 మందికిగాను 140, తెలుగు 150 మందికి గాను 95, హిందీ 20 మందికిగాను 15, సివిక్స్‌కు 98 మందికిగాను 60 మంది హాజరయ్యారు. ఆర్డర్లు పొందిన 260 మంది అధ్యాపకులు విధులకు డుమ్మా కొట్టారు.