
మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న దృశ్యం
డ్రిప్ పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఏడాది మిరప సాగును డ్రిప్ కింద చేపట్టారు. అందువల్ల మిరపలో రికార్డు స్థాయి దిగుబడులు వస్తున్నాయి. అన్ని పంటల్లోను సూక్ష్మ సేద్యం వల్ల దిగుబడులు కనీసం 20–30 శాతం వరకు పెరుగుతుండటం విశేషం. కొంతమంది రైతులు 50శాతం వరకు దిగుబడులు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దిగుబడులు నాణ్యతతో ఉండటం వల్ల మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. ఈ సారి మిర్చిలో క్వింటాకు రూ.53 వేల ధర లభించడం పట్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.