గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరులో ఉన్న ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో పది మంది అధ్యాపకులను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారిలో తొమ్మిది మంది విధుల్లో చేరారు. డైట్‌లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో చాలా కాలానికి పది మంది స్కూల్ టీచర్లను డెప్యుటేషన్‌పై నియమించారు. వారిలో ముగ్గురు శనివారం, మరో ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. రాధాకృష్ణ (ఫిలాసఫీ), రాంప్రసాద్ (గణితం), డాక్టర్ మోహనరావు(గణితం), శ్రీనివాస్ (సైన్స్), శివ పార్వతి (సైన్స్), వేణుగోపాల్ (తెలుగు), వెంకట సుబ్బలక్ష్మి (ఇంగ్లిష్), జోజిబాబు (ఇంగ్లిష్), లక్ష్మీనాంచారమ్మ (సైకాలజీ) ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా డైట్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ పి.వినయకుమార్ నూతనంగా విధుల్లో చేరిన వారికి అభినందనలు తెలిపారు. వారికి కొన్ని సూచనలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో శిశు మరణాలపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ జరిగిన శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయా శిశువుల మరణాలపై అంతర్గత శాఖాపరమైన ఆడిట్ నిర్వహించారు. ప్రతి శిశు మరణాన్ని శాసీ్త్రయ దృక్ఫ థంతో విశ్లేషించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని స్పష్టంచేశారు. పోషకాహార, జన్యు, అవగాహనలోపాలు, సామాజిక కారణాలు తదితర వాటిని విశ్లేషించుకోవడం రానున్న రోజుల్లో శిశు మరణాలను నివారించగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ శరత్‌బాబు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతి, శిశు మరణాలు జరిగిన ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా నరసింహ స్వామి తెప్పోత్సవం
వేదాద్రి(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తరుకల్యాణ మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభ వంగా జరిగింది. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో ప్రత్యేకంగా పడవను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నదిలో ఊరేగించారు. లోకకల్యాణార్థం ఏటా స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పరాంకుశం శ్రీధరాచార్యులు, శేషాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సురేష్‌బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మండు వేసవిలో మంచు తెరలు
చల్లపలి: మండు వేసవిలో మండల కేంద్రమైన చల్లపల్లిలో మంచు తెరలు కనువిందుచేశాయి. వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా నమోదవుతయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కురిసిన మంచు ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. మండు వేసవిలో మంచు ఇలా మంచు పట్టడంపై ప్రజలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. తెల్లవారుజాము నుంచి ఏడు గంటల వరకు మంచు దట్టంగా కురిసింది.